Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకుల మోసపూరిత విధానాలను తిప్పికొట్టాలి
- బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్
నవతెలంగాణ-ములుగు
బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు నరేష్కుమార్, ప్రధాన కార్యదర్శి కాడపాక రాజశేఖర్ వర్మ కోరారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా కోఆర్డినేటర్ గుండాల రఘుతో కలిసి మండలంలోని కొత్తూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం నరేష్, రాజశేఖర్ వర్మ సందర్శించారు. అనంతరం రైతులతో కలిసి బహుజన రాజ్యాధికార యాత్ర పోస్టర్‌ను ఆవష్కరించారు. ఈ సందర్భంగా నరేష్కుమార్, రాజశేఖర్ వర్మ మాట్లాడారు. పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ రైతుల సమగ్రాభివృద్ధి, సమస్యల పరిష్కార దిశగా ప్రజలను చైతన్యవంతం చేసేలా బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టారని తెలిపారు. పాలకుల తప్పుడు విధానాలపై బహుజనులకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా యాత్ర సాగుతోందని చెప్పారు. దేశ జనాభాలో 90 శాతానికి పైగా ఉన్న బడుగులు బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తేనే రాష్ట్రంలో అన్ని తరగతులకు సుపరిపాలన అందుతుందని స్పష్టం చేశారు. బహుజనులు ఏకమై రాజ్యాధికార సాధన దిశగా పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పాషా, రాంరెడ్డి, సమ్మయ్య, ఎల్లారావు, నర్సక్క, సరోజన, తదితరులు పాల్గొన్నారు.