Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరథ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
- అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-శాయంపేట
మిషన్ భగీరథ పైపులైను లీకేజీలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయ సురేఖ మండల సమాఖ్య సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి అధ్యక్షతన మండల సభ జరుగగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, శుద్ధమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. శాయంపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట, బస్టాండ్ కూడలిలో రోడ్డు పనుల్లో పైపులైను పగిలిన ఇప్పటివరకు కొత్త పైపులైను వేయక నీటి సరఫరా కావడం లేదని ఎంపిటిసి బాసాని చంద్రప్రకాష్ సభ దష్టికి తీసుకుకొచ్చారు. మళ్లీ జరిగే మండల సభకు పంచాయతీ కార్యదర్శులు హాజరుకావాలని ఎంపీవో రంజిత్ కుమార్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. రైతులు తమ పంట పొలాల్లో కొయ్యలను, చెత్తను తగలబెట్టడం వల్ల హరితహారం కార్యక్రమంలో చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు కాలిపోతున్నాయని సూరంపేట సర్పంచ్ రజిత సభ దష్టికి తీసుకువచ్చారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని పెద్దకొడపాక సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి తెలుపగా లారీల సమస్య ఉందని సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామని ఏపీఎం శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి :ఎమ్మెల్యే గండ్ర
గ్రామాల్లోని చెరువులను సమీపంలోని రైతులు కబ్జాలకు గురిచేస్తూ అన్యాక్రాంతం చేస్తున్నారని, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి హద్దులను గుర్తించాలని, చెరువు ప్రక్కన బోర్డు ఏర్పాటు చేసి చెరువు విస్తీర్ణం రాసి పెట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. జూన్ 3 నుండి పల్లె ప్రగతి కార్యక్రమం చేపడుతున్నామని, గ్రామాలలో మిగిలిన అభివద్ధి పనులను చేయాలని సర్పంచులను ఆదేశించారు. వానకాలం ప్రారంభ దశలో వ్యవసాయ శాఖ రైతులను పంట సాగు పై చైతన్యవంతులను చేయాలని సూచించారు. జీలుగ విత్తనాలు, పెసర్లు రైతులు సాగు చేసేలా చూడాలని, వీటితో భూసారం పెరుగుతుందన్నారు. అనంతరం విద్యుత్ ప్రమాదంతో మరణించిన గంగుల సౌందర్యకు విద్యుత్ శాఖ నుండి మంజూరైన రూ.5 లక్షల చెక్కును గండ్ర దంపతులు కుటుంబ సభ్యులకు అందజేశారు. సమావేశంలో పరకాల ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, తహసిల్దార్ చలమల్ల రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.