Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య
నవతెలంగాణ-నర్మెట్ట
'మన ఊరు-మన బడి'లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. మండలంలోని బొమ్మకూరులో చేపట్టిన 'మన ఊరు-మన బడి' ప్రణాళిక పనులను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. 'మన ఊరు-మన బడి'లో చేపట్టిన పనుల్లో రాష్ట్రంలో జిల్లానే ముందుందని చెప్పారు. అధికారులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. పనులు వేగంగా సాగేలా సర్పంచ్‌లు చొరవ తీసుకోవాలని చెప్పారు. ప్రధానంగా పాఠశాలల ప్రహరీలు, మరుగుదొడ్లు, వంట గదులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌లు, ప్రధానోపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మెన్లు సమన్వయంతో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు, తహసీల్దార్ గంగాభవాని, డీఈఓ రాము, నోడల్ ఆఫీసర్ కొండల్‌రెడ్డి, స్కూల్ హెచ్ఎం అంకం రాజ్‌కుమార్, ఏపీఓ రమాదేవి, గ్రామ కార్యదర్శి సుజాత, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ మంజుల, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.