Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వామపక్షాలు నిరసన
నవతెలంగాణ-వరంగల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని సిపిఐ (ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సింగారపు బాబు డిమాండ్ చేశారు. వరంగల్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిర సన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు బుస్స రవి, సత్యనారాయణ, బషీర్, దయాకర్, ఆరూరి కుమార్, పనస ప్రసాద్, అరూరి కుమార్, గుండె బద్రి తదితరులు పాల్గొన్నారు.
మట్టెవాడ : నిత్యావసర వస్తువులు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి పేదలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలనీ సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి డిమాండ్ చేశారు. శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖిలావరంగల్ మండల ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి తహసిల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్ర మాన్ని ఉద్దేశించి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మా ట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల ద్వంద్వ నీతిని అవలంబిస్తూ పేదల సంక్షేమాన్ని మరిచి పేద, మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు నలిగంటి రత్నమాల, సిపిఐ ఖిలావరంగల్ మండల కార్య దర్శి దండు లక్ష్మణ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంగీ ఎలేంధర్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు బండి కోటేశ్వరరావు, కృష్ణ సిపిఐ నాయకులు సౌందర్య, భవాని, సువర్ణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
భారీ ప్రదర్శన, తహసిల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా
నర్సంపేట : పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పంజాల రమేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొరబోయిన కుమారస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం నిత్యావసర వస్తువుల ధరలను తగించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, సీపీఐ మండల కార్యదర్శి గడ్డం యాకయ్య, సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు కత్తి కట్టయ్య, శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ సం జీవ, బుర్రి ఆంజనేయులు, కమతం వెంకన్న, గడ్డమీది బాలకష్ణ, పెండ్యాల సారయ్య, కందికొండ రాజు, నాయకులు ఇప్ప సతీష్, నాగమణి, రుద్రారపు లక్ష్మి, గణిపాక ఇంద్ర, పాలక కవిత, తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి : నిత్యావసర ధరలు తగ్గించాలని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు బందు సాయిలు, రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి సా యిలు ప్రవీణ్ కుమార్, సతీష్, కంపటి రాజయ్య, మల్లయ్య, కోటిలింగం, భూమయ్య, అజరు, కరుణాకర్ పాల్గొన్నారు.
పరకాల : నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే వరకు పోరాటాలు చేస్తామని సిపిఐ మండల నాయకులు దుప్పటి సాంబయ్య శుక్రవారం తెలిపారు. కార్యక్రమంలో స ిపిఐ నాయకులు ప్రభాకర్, చంద్రమౌళి, రాజు పాల్గొన్నారు.
నెక్కొండ : పెంచిన ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈదునూరి వెంకన్న డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యురాలు ఈదునూరి మాలతి, స్థానికులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : మండల కేంద్రంలో పెంచిన నిత్యావసర ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేస్తూ నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాములు, సిపిఐ జిల్లా సభ్యులు కామెరా వెంకటరమణ, మహిళా సమైక్య నాయకురాలు తిర ుమల, సిపిఐ మండల నాయకులు మనోహర్, తండ మొం డయ్య, శనిగరపు రాజయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు మనోహర్ రావు, రాజురెడ్డి, అశోక్‌రావు, సదానందం, తదితరులు పాల్గొన్నారు.
మహాముత్తారం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమై పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పేదల నడ్డి విరుస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పోలం.రాజేందర్ అన్నారు. కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీ సభ్యులు పొలం చిన్న రాజేందర్, మానేటి బాబు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ : నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలకు చుక్కలు చూపెడుతూ అర్ధాకలితో బతుకుతున్న పేద వారిని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ధరలను అదుపు చేయలేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో కాళోజి సెంటర్ వద్ద పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రాస్తారోకో చేపట్టారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కొట్టపాక రవి, శంకర్, శ్రీనివాస్, సాగరిక ,మరి విజరు, ఉమ తదితరులు పాల్గొన్నారు.