Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చరమగీతం పాడాలి
- టీపీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుమారస్వామి
నవతెలంగాణ-ములుగు
పాలకుల తప్పుడు విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చరమగీతం పాడాలని వారు ప్రజలను కోరారు. మండలంలోని రామచంద్రపూర్, గుర్తురుతండా, కొడిషలకుంట గ్రామాల్లో శుక్రవారం రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా రవళిరెడ్డి, కుమారస్వామి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, అన్ని తరగతుల ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసపూరిత పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. ప్రజల మనోభావాలను, వందలాది ప్రాణత్యాగాలను గౌరవించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వగా మోసపూరిత హామీలతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దుష్టపాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే సుపరిపాలన అందిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస పార్టీని గెలిపించి మెరుగైన పాలన దిశగా బాటలు వేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు డిక్లరేషన్‌లోని అన్ని అంశాలనూ అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, పార్టీ మండల అధ్యక్షుడు చాంద్ పాషా, సహకార సంఘం చైర్మెన్ బొక్క సత్తిరెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వాకిటి రామకృష్ణారెడ్డి, వంచ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అంకూస్, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండలంలోని మొద్దులగూడెంలో పసర క్లస్టర్ ఇన్‌ఛార్జిలు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, కుర్సం కన్నయ్య ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ రచ్చబండ నిర్వహించగా పీఏసీఎస్ చైర్మెన్ పన్నాల ఎల్లారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, మొద్దులగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు బర్ల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని నిమ్మగూడెంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అనుబంధ ఎస్టీ సెల్ జిల్లా అద్యక్షుడు గుమ్మడి సోమయ్య పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి వల్లిపల్లి శివయ్య, మండల అధికార ప్రతినిధి జగన్మోహన్రెడ్డి, వెంగల బుచ్చిరెడ్డి, సున్నం ఆనందం, రాజుపేట గ్రామ కన్వీనర్ చందర్లపాటి శ్రీనివాస్, కోకన్వీనర్ తీగల మల్లారెడ్డి, నాదెండ్ల హరీష్, ముత్యాలరావు, విద్యాసాగర్, మద్దిపాటి శేషు, కొమరం బాలయ్య, కొమరం రామకృష్ణ, పోట్రు సమ్మయ్య, తుమ్మల ముఖర్జీ, కర్రి చిన్నపుల్లయ్య, గంగెర్ల రాజరత్నం, అనుముల రాఘవరెడ్డి, గౌరారపు విశ్వనాధం, చదలవాడ సమ్మయ్య, శ్రీను, రామయ్య, నర్సింహారావు, చిన్నమల్లయ్య, రాంప్రసాద్, వరప్రసాద్ పాల్గొన్నారు.