Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
తెలంగాణలో రైతే రాజు ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి 24 గంటల కరెంటు అందిస్తున్నదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని కడవెండి గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతు వేదికను ప్రారంభించారు. పల్లె పకతి వనంను సందర్శించి సేద తీరారు. ంతరం మన ఊరు మన బడి కార్యక్ర మంలో భాగంగా పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కూమర్ సుల్తానీయ,కమీషనర్ శరత్, జెడ్పీ చైర్పర్సన్ చెవెల్ల సంపత్,గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి బెత్లీనా,డిఇఓ రాము, జెడ్పీటీసీ పల్ల భార్గవి, ఎంపీపీ బస్వ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో... పల్లెలు వికసించాలి
రాయపర్తి : రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెడుతున్న 5వ విడత పల్లె ప్రగతితో ప్రతి పల్లె వికసించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని బంధనపల్లి గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పనులను పరిశీలించి పలుగు పార పట్టి పని చేశారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండలంలోని కొత్తూరు గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. తదు పరి ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గోపితో కలిసి గ్రామ సర్పంచ్ కందికట్ల స్వామిఅధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివద్ధి శూన్యమన దుయ్యబట్టారు. వ్యవసాయానికి పెట్టు బడి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. సర్పంచులకు ప్రభుత్వం రూపాయి బాకీ లేదని, . సర్పంచులు భయం వీడి పనులు చేయాలన్నారు. కొత్తూరు బడిని రూ.60లక్షలతో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. దళిత బంధుతో దళితులు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు. బీజేపీ చెప్పేవన్నీ అబద్దాలని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కుట్రపన్నుతోందన్నారు. అనంత రం రాయపర్తి మండల శివారులోని క్రీడా ప్రాంగణం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ గారె నర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ రాయపర్తిలో రోడ్డు వెడల్పుతో గ్రామానికి నూతన శోభ సంతరించుకుందన్నారు. రోడ్డు వెడల్పుతో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రమ్ ఇండ్లలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. గ్రామానికి అవసరమైన పనులు ముమ్మ రంగా చేపట్టాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియ, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ శరత్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఆడిషన్ కలెక్టర్ హరి సింగ్, డీఆర్డీఏ పీడీ సంపత్‌రావు, డీపీఓ స్వరూప, డీఈఓ వాసంతి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ కిషన్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ పాల్గొన్నారు.