Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు మధుసూదన్
నవతెలంగాణ-కొడకండ్ల
బీజేపీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేయడం సరైంది కాదని సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు మధుసూదన్ అన్నారు. శుక్రవారం స్తానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడంతో పాటు మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టి ప్రజలకు అమలయ్యేలా చర్యలు చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీజేపీ ఎక్కడ కనుమరుగై పోతుందనే అపనమ్మకంతో టీిఆర్ఎస్ సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోని 12,500 గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో లో సర్పంచులు సైదులు, రాములు నాయక్, శ్రీలేఖ, శిరీష, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.