Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
దేశంలో రోజురోజుకు మతోన్మాద దాడులు, అగ్రకుల ఉన్మాద దాడులు పెరుగుతున్నాయని, రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ తికాయర్ పై జరిగిన దాడిని ఖండించాలని ఏఐకేఎస్‌సీసీ జిల్లా కో కన్వీనర్ రాచర్ల బాలరాజు అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద జిల్లా కో కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ రైతాంగం ఉద్యమించి విజయం సాధించారన్నారు. ఈ సందర్భంలో కనీస మద్దతు ధర హక్కు చట్టం, అమరులైన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తానని మోడీ ప్రకటించి నేటికీ పట్టించుకోవడం లేదని అన్నారు. కర్ణాటకలో గతంలో ప్రొఫెసర్ కల్బుర్గి పాత్రికేయురాలు గౌరీ లంకేష్ ను మతోన్మాద గుండాలే హత్య చేశారని ఆరోపించారు. ఐనవోలు మండలం పెరుమాండ్ల గూడెంలో జరిగిన ఘటనను సాకుగా తీసుకొని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగింప చేయడాన్ని ఖండించారు. ల్యాండ్ పులింగ్ నోటిఫికేషన్ ప్రక్రియ ఆపి వేశామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవో 8ఏను రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చాలని డిమాండ్ చేశారు రైతు సంఘాల నాయకులు బీరం రాములు, సుద్ధమల్ల భాస్కర్, హన్సల్ రెడ్డి, బండి కోటేశ్వరరావు, బైర బోయిన అయిలయ్య ,గండ్రతి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.