Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
వైద్యాధికారితోపాటు సిబ్బంది సమయపాలన పాటించాలని భూపాలపల్లి జిల్లా డీఎంహెచ్ఓ శ్రీరామ్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఎంపిపి చింతలపల్లి మలహల్రావు తో కలిసి సందర్షించి, రోజువారి రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయుష్ విభాగాన్ని సందర్షించి ఎవరు లేకపోవడంతో అసంతప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో త్వరలో 24 గంటలు వైద్య సేవలు అందేలా సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. ఇందుకు వైద్యాధికారి, ఏఏన్ఎంలు రెసిడెన్షియల్ ఉండడానికి హెడ్ క్వాటర్ నిర్మాణం చేయునట్లు తెలిపారు. ఏఎమ్మార్ సిబ్బంది, పరికరాలను ఇకనుంచి వాడకంలోకి తీసుకోవద్దని వైద్యాధికారి దీపక్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.