Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్రంలో ప్రతీ ఊరిలో ప్రజలకు ఉపయోగకర మైన సదుపాయ, వసతుల కల్పించి, మౌళిక సదుపాయాల్ని అందించి, అత్యంత ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దగా దేశంలోనే గుర్తింపు పొందిన గ్రామాలుగా ఈ రాష్ట్రానికి దక్కడం కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనమని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల్లో గ్రామగ్రామాన పల్లెప్రగతి 5వ విడత ప్రారంభోత్సవ గ్రామసభలు మొదటి రోజున ప్రశాంతంగా జరిగాయి. మండలం లోని పాంనూర్ గ్రామంలో పల్లెప్రగతి గ్రామసభ సర్పంచ్ కోతి రేణుక రాములు అధ్యక్షతన జరగ్గా ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి హజరు కాగా చాగల్, సముద్రాల, అక్కపల్లి గూడెం గ్రామ లలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, తాటికొండ లో వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను సర్వతో ముఖాభివద్ధి చేయాలనే సదుద్దేశ్యంతో పల్లెప్రగతి నాలుగు విడతల విజయవంతానికి సర్పంచులు ముఖ్య భూమిక పోషించారని అభినం దించారు. ప్రతీ నెలా జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు జిపి నిధులు విడుదల చేస్తోందని అన్నారు. కాగా నేటికీ రూ.14వేల కోట్లు కేంద్రప్ర భుత్వం, రాష్ట్రానికి అప్పు పడిందని అన్నారు. రాష్ట్రం పై కేంద్రం కక్ష్య గట్టి మోడీ, మొండి వైఖరితో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటిినీ ప్రతీ గ్రామానికి నర్సరీ, పల్లెప్రకతి వనం, వైకుంఠ దామం, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నిత్యం కరెంట్, మిషన్ కాకతీయ ద్వారా రూ.45వేల చెరువులు, కుంటలు అభివధి పరచి సాగునీరు, రూ.44వేలకోట్ల వ్యయం తో ఇంటింటికీ మిషన్ భగీరథ మంచినీరు, రైతు పెట్టుబడి, బంధు, దళిత బంధు, మహిళా సంక్షే మం వంటి అనేక చేస్తూ ప్రజయోగ్యమైన, ఊహకందని సేవలని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. పాంనూర్ గ్రామంలో రూ. 25లక్షలతో నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి హామీ ఇస్తూనే, రూ.2-3 కోట్లు ఖర్చైనా బంజర కాల్వ మరమ్మత్తుల కోసం సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్తానని పనులు జరిపిస్తానని అన్నారు. 3నుంచి 18వరకు నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమంలో పల్లె ప్రగతి విజయ వంతానికి సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపిపి కందుల రేఖ, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, ఎంపీడీఓ కుమారస్వామి, ఎంపీటీసీ ఇనుగాల రజిత రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఎఎంసి డైరెక్టర్ చిగురు సరిత పాల్గొన్నారు.