Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
దేశంలో రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యమని నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్య నారాయణరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ముల్కలపల్లి, వేములపల్లి, కాసులపాడ్, బంగ్లాపల్లి, కొరికిషాల, పోతుగళ్లు,బద్దంపల్లె, గణేష్ పల్లె, గ్రామాలలో జరిగిన రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్య క్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులెవరు పంట రుణాలను తిరిగి బ్యాంకు లో చెల్లించరాదని, రాబో యేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు15వేలు, పంటలకు గిట్టుబాటు ధర, ధరలు ముందే నిర్ణయించి ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, మెరుగైన పంటల భీమను తీసుకొస్తామని, రైతు కూలీలకు, భూమి లేని రైతులకు భీమా, ఉపాధిహామీ పథకానికి వ్యవసా యాన్ని అనుసంధానం చేస్తామన్నారు. ధరణి పోర్టల్ వ్యవస్థను రద్దు చేసి, మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని భరోసా కల్పించారు.
రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టపరమైన అధికారాలతో రైతు కమీషన్, వ్యవసాయాన్ని పండగ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కషి చేస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కు తుందని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి, నాయకులు సుదర్శన్ గౌడ్, రవీందర్,లింగారవు, రఫీ, రాజు, రాము, రాకేష్ రెడ్డి, ప్రసాద్, భద్రయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.