Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రచ్చబండలో పొన్నాల
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో చేసిన డిక్లరేషన్ ప్రకటన ప్రత్యర్థి పార్టీల్లో గుబులు రేపుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రూ.2లక్షలు రుణమాఫీ చేస్తుందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం జనగామ మండలం వడ్లకొండ, గానుగుపహాడ్, పెద్దపహాడ్, వెంకిర్యాల, అడవికేశ్వాపూర్ గోపరాజుపల్లి గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గోపరాజుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాటాడారు. టీఆర్ఎస్ పాలనలో ప్రతి గ్రామంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయన్నారు. వెంకిర్యాల గ్రామంలో మహిళలు కూడబెట్టుకున్న పొదుపు సొమ్ము మాయమైందని, గోపరాజుపల్లిలో దళితుల భూమిని నర్సరీ పేరిట ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలుస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. టిఆర్ఎస్ పాలనలో దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, నిరుద్యోగ భతి చెల్లించలేదని, ఉచిత ఎరువుల సరఫరా లేదని, పంట నష్టపరిహారం ఇవ్వలేదని, ధాన్యం కొనుగోలులో చిత్తశుద్ధి లేదని, డబుల్ బెడ్రూం ఇళ్ళు, రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఉద్యమకారులకు మొండిచేయి చూపిందని ఎద్దేవా చేశారు. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులను కట్టబెట్టాడని ఆరోపించారు. అనంతరం వరంగల్ డిక్లరేషన్ గురించి వివరించారు. మద్దూరు జెడ్పీటీసీ గిరి కొండిలెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సంతోష్‌రెడ్డి, నాయకులు ఉడుత రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర, పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికే : మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి
తరిగొప్పుల : రైతు సమస్యల పరిష్కారానికే వరంగల్ సభలో కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించినట్టు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహంచారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గడపగడపకు కాంగ్రెస్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు వరంగల్ సభలో కాంగ్రెస్ డిక్లరేషన్‌ను ప్రకటించడం జరిగిందన్నారు. ఆ డిక్లేరేషన్ లో పేర్కొన్న ప్రతి హామీని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని వివరించారు. మాజీ జెడ్పీటీసీ గాదె మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గంగం నర్సింహ్మారెడ్డి గారు, వగలబోయిన యాదగిరి గౌడ్, సోలిపురం సిద్దులు, సర్పంచ్,గాదేపాక శ్రీను, ల్యాగల అంజయ్య, యూత్ కాంగ్రేస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు కళ్యాణం ప్రవీణ్,ఎండబట్ల కర్ణకర పాల్గొన్నారు.
యువతకు అండగా కాంగ్రెస్ : దొంతి
చెన్నారావుపేట : యువతకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ధర్మతండాకు చెందిన 50 కుటుంబాలు శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల్లో పేదలకు చేసిందేమీ లేదని అన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొందన్నారు. మండల అధ్యక్షుడు భూక్య గోపాల్‌నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్య శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రమేష్ యాదవ్, కార్యదర్శి మంచాల సదయ్య, సర్పంచ్ తప్పెట రమేష్, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు రూపిక శ్రావణ్, మండల యూత్ అధ్యక్షుడు బండి హరీష్, తదితరులు పాల్గొన్నారు.
రైతు కష్టాలను తీర్చడమే కాంగ్రెస్ లక్ష్యం : పీసీసీ సభ్యులు అమృతరావు
జఫర్గడ్ : కెేసీఆర్ నిరంకుశ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు నిరంతరం కషి చేయాలని పీసీసీ సభ్యులు గంగారపు అమతరావు అన్నారు. శుక్రవారం మండలంలోని తీగారం, సూరారం, హిమ్మత్‌నగర్, తమ్మడపళ్లి(జి) గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షులు నూకల ఐలయ్య ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల ప్రదేశానికివెళ్లి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి వివరించి ఆయన మాట్లాడారు. వరి వేయొద్దని చెప్పి కేసీఆర్ మాత్రం 150 ఎకరాలలో వేశాడని, మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రైతు బంధు ఇచ్చినట్టే ఇచ్చి యూరియా, డీఏపీ, దుక్కిపిండి వంటి ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. నేటికీ గ్రామాల్లో ఇందరమ్మ ఇండ్లు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపుచేయలేని దుర్మార్గ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కషి చేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్‌రెడ్డి, రచ్చబండ మండల ఇన్చార్జి మేకల నరేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య , మాజీ మండల అధ్యక్షులు చిట్టిమల్లే కష్ణమూర్తి, ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మెన్ ఎల్లందుల బాబు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గఉపాధ్యక్షులు తాటికాయల రాజేందర పాల్గొన్నారు.