Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఉత్తమ నగర జీవన విధానానికి పట్టణ ప్రగతి పునాది అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు. శుక్రవారం జిడబ్ల్యూఎంసి 29వ డివిజన్ రామన్నపేటలోని కుంటి వీరభద్రయ్య గుడి వద్ద నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యతో కలసి నాల్గవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణాలు అభివద్ధి చెందేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. ప్రజాప్రతి నిధులు అధికారుల సమన్వయతో సమస్యలను పరిష్కరిం చుకోవాలని కోరారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ 29 వ డివిజన్లో రూ.943లక్షలతో 91 పనులు మంజూరు కాగా రూ.155 లక్షలతో 44 పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు త్వరలో చేపడుతామని అన్నారు. 29 డివిజన్ లో బస్తి దవాఖాన ఏర్పాటుకు మంత్రి తన్నీరు హరీష్ రావు ను కోరామన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం నకు నిధులు మంజూరచ య్యాయని, త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఆయా డివిజన్ లలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గందె కల్పన నవీన్, సదన్త్, మధు రవీందర్ కొలిపాక శ్రీనాథ్, సిద్ధిరాములు కుసుమ రమేష్ తదితరులు పాల్గొన్నారు.