Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసరలో ఉపాధి హామీ పనులను టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు పొరిక గోవింద్‌నాయక్, ఎంపీపీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరపనేని సాయి కుమార్ ఆధ్వర్యంలో కూలీలకు మజ్జిగ, అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోరిక గోవింద్‌నాయక్ మాట్లాడారు. ఎండ తీవ్రత నేపథ్యంలో మజ్జిగ, అరటి పండ్లు అందించినట్టు తెలిపారు. పంపిణీ చేయడం జరిగింది అన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పని ప్రదేశంలో టెంట్, ఇతర సౌకర్యాలు కల్పించేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఉపాధి పని చేసే వారికి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకావత్ నర్సింహ, వెంకట్‌రెడ్డి, భూక్యా అమర్‌సింగ్, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ సానికొమ్ము ఆదిరెడ్డి, ఓదెలు, చందర్ రాజు, నరేందర్, సమ్మిరెడ్డి, తదిదరులు పాల్గొన్నారు.