Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ గణేష్
నవతెలంగాణ-ములుగు
ఈనెల 12న టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ గణేష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో టెట్ నిర్వహణపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్ష మొదటి, రెండు పేపర్లను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో వైద్య అధికారులు అందుబాటులో ఉండాలని, ఆర్టీసీ ద్వారా పరీక్ష రోజు సంబంధిత రూట్ల మీదుగా బస్సులు వేళకు నడిచేలా సమన్వయం చేసుకోవాలని, స్ట్రాంగ్ రూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తదితర సూచనలు అందించారు. తొలుత డీఈఓ పాణిని టెట్ వివరాలను వెల్లడించారు. 12న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. టెట్ పరీక్షలో మొదటి పేపర్ నిర్వహణకు 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 1809 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. అలాగే రెండో పేపర్‌కు 7 సెంటర్లలో 1256 మంది పరీక్ష రాయనున్నారని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, విద్యుత్ శాఖ డీఈ మర్రెడ్డి, ఆర్టీసీ డీఎం మోహన్, ఇన్స్పెక్టర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.