Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
పట్టణాలలో మెరుగైన జీవన పరిస్థితుల కల్పనకు అధికారులు కషి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవెష్ మిశ్రా తెలిపారు. శుక్రవారం నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ 27వ వార్డు లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంక టరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర, జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ వెంకటరాణి ప్రారంభించారు. ముందుగా 27వ వార్డు లోని హైటెక్ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, రెవెన్యూ కాలనీ లో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వార్డులోని సైడ్ డ్రై ఇన్స్, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేసి డంపింగ్ యార్డ్‌లా మారుస్తున్న వారిపై చర్యలు తీసు కోవాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ... పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో జరగడం లేదని అన్నారు. 27 వార్డులలోని నాలుగు ప్లాట్లలో చెత్త వేస్తున్నారని చర్యలు తీసుకుం టామని తెలిపారు. ప్రతి వార్డులో వార్డు కమిటీ, గ్రీన్ కమిటీలను ఏర్పాటు చేసి వార్డు పనుల పరిశీలన పై నివేదిక సమర్పిస్తారని అన్నారు. డ్రయినేజీలపై నిర్మాణాలు చేపట్టడంతో మురుగుకూపాలుగా మారుతున్నాయని అన్నారు. వార్డుల్లో రోడ్లను వెడల్పు చేసి అన్ని సౌకర్యాలను కల్పించొచ్చని అన్నారు. చెత్త తరలింపు వహనాల డ్రైవర్ల కొరత ఉందని వార్డు కౌన్సిలర్ హరీష్ రెడ్డి తెలపగాబ 15 మంది కొత్త డ్రైవర్లను తీసుకోవాలని మున్సిపల్ అధికా రులను ఆదేశించారు. డ్రైనేజీ పై ఇంటి నిర్మాణాలు చేపట్టా రని, పది ఫీట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని సరికాదన్నారు. వారందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. వర్షాకాలం రాకముందే మిషన్ భగీరథ గుంతలు పూడ్చివేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ... వార్డులో మిషన్ భగీరథ పథకం కొరకు రోడ్లను తవ్వడంతో ప్రజలకు చాలా ఇబ్బం దులకు గురి చేస్తున్నారని మిషన్ భగీరథ సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. అందరూ ఒక నిర్ణయానికి వచ్చి చెబితే రోడ్లను, కాలువలను మంచిగా చేస్తామని తెలిపారు. వార్డులోని ప్రజలు డ్రైన్లు రోడ్లు కావాలని అడిగారని వీటికి ఎస్టిమేషన్ వేసి నివేదిక పంపాలని తెలిపారు. పట్టణ ప్రగతి లో సింగరేణి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ వెంకట రమణ మాట్లాడుతూ పట్టణ, పల్లె ప్రగతిలో జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములవ్వాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కే హరి బాబు, వార్డు కౌన్సిలర్ హరీష్ రెడ్డి, మున్సిపల్ ఏఈ రోజా రాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, టౌన్ ప్లానింగ్ అధికారి పి అవినాష్, విక్రమ్ పాల్గొన్నారు.