Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొని జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని డీఈఓ పాణిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్లో బడిబాట కరపత్రాన్ని శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టుతున్న క్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరూ బడిబాటలో పాల్గొని పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను, హాజరు శాతాన్ని పెంచాలని కోరారు. తొలిరోజు ముగ్గురు విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చిన ములుగు బాలుర హైస్కూల్ బృందాన్ని, ఇద్దరు విద్యార్థులకు ప్రవేశం కల్పించిన బంజరుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బందాన్ని డీఈఓ అభినందించారు. ములుగు డీసీఈబీ కార్యదర్శి, బాలుర హైస్కూల్ హెచ్ఎం విజయమ్మ మాట్లాడుతూ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతోపాటు ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ సామల శ్రీనివాసులు, జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, ఉపాధ్యాయులు క్యాతం రాజేందర్, పిట్టల మల్లయ్య, మొహమ్మద్ నజీరుద్దీన్, శిరుప సతీష్ కుమార్, తోట చంద్రమౌళి, గుండేటి మమత, ఎస్టియు ములుగు జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ చల్లా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.