Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
సమాజంలోని ప్రతిఒక్కరికీ విద్య అవసరమని జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు అన్నారు. మండల కేంద్రంలో ఎంఈఓ ఆధ్వర్యంలో బడిబాట ర్యాలీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా జెడ్పీటీసీ హరిబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనా ఉందన్నారు. నర్రా నర్సింహారావు దంపతులు వారి కుమార్తె సుజితను, బండి మల్లేష్ పిల్లలను పాఠశాలలో చేర్పించారు. అనంతరం ఏఎంఓ బద్దం సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. బడిఈడు పిల్లలందరూ పాఠశాలకు వెళ్లేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి జోగానాయక్, ఉపసర్పంచ్ హన్మంతరావు, ఎంపీటీసీ ఏడుకొండలు, గ్రామ పంచాయతీ ఈఓ శంకరయ్య, ప్రధానోపాధ్యాయులు ఖలీల్, జ్యోతి, రఘురాం, తదితరులు పాల్గొన్నారు.