Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాల్పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-బయ్యారం
పోడుభూముల రక్షణ, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న మహబూబాబాద్ తలపెట్టిన ప్రదర్శన, ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి మదార్ కోరారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని వినోబాబునగరంలో ప్రదర్శన, ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మదార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా మోసం చేస్తోందని విమర్శించారు. పోడు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులు, గిరిజనులు ఇతర పేదల పరిస్థితి అయోమయంగా మారిందన్నారు. అనేక ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా హరితహారం పేరుతో లాక్కోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న తలపెట్టిన ప్రదర్శన, ధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఎస్డీఎల్సీ మండల, గ్రామ నాయకులు మేకల ఉప్పలయ్య, దుస్సా వీరభద్రం, నిమ్మరబొయిన మల్లేశం, చిన్న లింగయ్య, సదానందం, పుల్లయ్య, కిషన్, నాగేశ్వర రావు, వీరభద్రం, లచ్చిరాం, మహేశ్, పడిత్యా, అశోక్, సంజీవ, గ్యామ తదితరులు పాల్గొన్నారు.