Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్య మని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని 19వ వార్డులోని మార్వాడి సత్రం లో వార్డ్ కమిటీ సభ్యులతో శుక్రవారం నిర్వ హించిన సమావేశంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ శశాంకలతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని మాట్లాడారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా సమగ్రాభి వృద్ధి జరగనుందని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చా పల్లెలు, పట్ట ణాలు సమగ్రాభివృద్ధి సాధించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మెన్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మండలంలోని కల్వలలోని జెడ్పీ సెకండరీ స్కూల్లో నిర్వహించిన పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌లతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, సర్పంచ్ గంట సంజీవరెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యుడు యాకూబ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనాథ్‌రెడ్డి, ఎంపీటీసీ అశోక్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుణ్ జ్యోతి, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.
భీమదేవరపల్లి : మండలంలోని విశ్వనాథ కాలనీ, ముల్కనూరు, ముత్తారం గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించి మాట్లాడారు. అనంతరం ముల్కనూర్‌లో వాలీబాల్ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఎంపీపీ అనిత, జెడ్పీటీసీ వంగ రవి, తదితరులు పాల్గొన్నారు
తాడ్వాయి : మండలంలోని మేడారం, కామారం, ఊరట్టం, తాడ్వాయి గ్రామాల్లో పల్లె ప్రగతి నిర్వహించగా జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మెన్ బడే నాగజ్యోతి, డీపీఓ వెంకయ్య, ఎంపీపీ గొంది వాణిశ్రీ, తహసీల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి అప్పయ్య, ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్, మేడారం సర్పంచ్ బాబురావు, ఊరట్టం సర్పంచ్ గొంది శ్రీధర్, ఆత్మ చైర్మెన్ రమణయ్య, పంచాయతీ కార్యదర్శి కొర్నెబెల్లి సతీష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూశెట్టి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండలంలోని చల్వాయి గ్రామ పంచాయతీలో సర్పంచ్ సమ్మయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించగా ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, మండల ప్రత్యేక అధికారి వెంకటనారాయణ మాట్లాడారు.
బయ్యారం : మండలంలోని కస్తూరినగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ బిందునాయక్ పాల్గొని ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాత గణేష్, సొసైటీ చైర్మెన్ మూల మధుకర్‌రెడ్డి, ఎంపీడీఓ చలపతిరావు, పీఆర్ ఏఈ రాజశేఖర్, సర్పంచ్ బానోత్ కష్ణకుమారి, ఉపసర్పంచ్ గుగులోత్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూర్ రూరల్ : మండలంలోని వెలికట్టె, గుడిబండతండాల్లో నిర్వహించిన పల్లె ప్రగతిలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి నర్మద, ఎంపీఓ గౌస్, సర్పంచ్‌లు పోసాని పుష్పలీల, లకావత్ శోభన, తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని మంగపేట, నర్సాపురం బోరు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, సొసైటీ చైర్మెన్ తోట రమేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పారిశుధ్య పనులు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో, ప్రధాన రహదారి వెంట ఉన్న చెట్లకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి పారిశుధ్య పనులు నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు హీరునాయక్, రాంబాబు, సొసైటీ డైరెక్టర్ నర్రా శ్రీధర్, చల్లగురుగుల తిరుపతి, మండల సోషల్ మీడియా ఇన్‌ఛార్జి గుడివాడ శ్రీహరి, నాయకులు యర్రంశెట్టి రామకష్ణ, మూగల రమేష్, నర్సింహమూర్తి, ఏకాంతం, జాడి కష్ణ, మూగల రాము, చక్రపాణి పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
శాయంపేట : గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ కందగట్ల రవి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించగా ప్రజలు పలు సమస్యలను వివరించారు. అనంతరం ఎంపీడీఓ ఆమంచ కృష్ణమూర్తి మాట్లాడారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో ఎంపీఓ రంజిత్‌కుమార్, ఉపసర్పంచ్ సుమన్, పంచాయతీ కార్యదర్శి రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.
చిన్నగూడూరు : మండలంలోని పగిడిపల్లిలో గ్రామసభ నిర్వహించగా సర్పంచ్ శిరీష మంగీలాల్, సఖి లీగల్ అడ్వైజర్ ఉష మాట్లాడారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమ్య, ఉపసర్పంచ్ వీరయ్య, వార్డు సభ్యులు సింధుజ శ్రీపాల్, హైమావతి, పంచాయతీ కార్యదర్శి రోజా, సఖి పారా మెడికల్ ఉద్యోగి షాహిద్ బేగం, తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర : మండలవ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించగా జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి, పాలకుర్తి ఆలయ కమిటీ చైర్మెన్ వెనకదాసుల రామచంద్రయ్య శర్మ మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ శ్రీనివాస్, ఎంపీఓ యాకయ్య, కార్యదర్శి వెంకన్న, లింగమూర్తి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని తండ ధర్మారంలో పాదయాత్ర నిర్వహించాల్సిన కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం సర్పంచ్ లక్ష్మీ లక్పతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించగా ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, ఉపసర్పంచ్ సేల, పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాస్, కార్యదర్శి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడ : మండలంలోని ముస్మి, కొత్తగూడ, గుంజేడు, రామన్నగూడెం గ్రామాల్లో ర్యాలీలు, గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చందా నరేష్, ఏటీడీఓ భాస్కర్, ఎంపీడీఓ భారతి మాట్లాడారు. కార్యక్రమంలో ముస్మి సర్పంచ్ కల్తీ రమ వెంకన్న, గుంజేడు సర్పంచ్ అజ్మీర రజిత రమేష్ నాయక్, కొత్తగూడ సర్పంచ్ మల్లెల రణధీర్, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
వేలేరు : మండలంలోని 14 గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి గ్రామసభ నిర్వహించారు. ప్రణాళిక తయారు చేశారు. గుండ్లసాగర్లో జెడ్పీ సీఈఓ సురభి వెంకటేశ్వర్రావు, జెడ్పీటీసీ చాడ సరిత, ఎంపీడీఓ రవిందర్, సర్పంచ్ గాదె ధర్మారెడ్డి, ప్రత్యేక అధికారి వెంకటేష్ పాల్గొనగా ఎర్రబెల్లిలో సర్పంచ్ గూడ కవిత రాజ్‌కుమార్, ప్రత్యేక అధికారి మొగిలిచెర్ల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి క్రాంతికుమార్, కారోబార్ జగన్, వార్డ్ సభ్యులు చిలుక భాస్కర్, తదితరులు పాల్గొన్నారు .