Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
టెట్ పరీక్షకు కు అన్ని ఏర్పాట్లు చేయాలని భవేష్ మిశ్ర అధికారులను ఆదేశించారు. శనివారం కేంద్రంలోని ప్రగతి భవన్ జరిగిన బడిబాట, టెట్ ఎగ్జామ్ పై జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జూన్12న భూపాలపల్లి జిల్లాలోని 9 సెంటర్లలో జరుగుతున్న టెట్ పరీక్షకు సంబంధిత అధికారులు అందరూ అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ అధికారులు పరీక్షల సమయంలో నిరంతరం విద్యుత్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రూటు ప్రకారం ఆర్టీసీ బస్సులను సకాలంలో నడిపే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ సిబ్బంది పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. ఎగ్జామ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బడి బాటలో భాగంగా సంబంధిత అధికారులు గ్రామాలలో ఉన్న పిల్లలను తప్పక స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా చూడాలన్నారు. అలాగే కరోనా కారణంగా విద్యార్థులను పాఠశాలలో చేరే విధంగా చూడాలన్నారు . ఈ కార్యక్రమంలో డిఇఓ శ్రీనివాసరావు, డిఎంఅండ్హెచ్ఓ శ్రీరామ్, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, పోలీస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.