Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్ బెల్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి సెక్యూరిటీ ఆఫీసు ఆవరణలో నిల్వచేసిన టేకు దుంగలు చెదలు పడుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం కేటీకే ఓసి త్రీ భూసేకరణలో భాగంగా ఆ భూములలో ఉన్న టేకఁ చెట్ల ను నరికిన దుంగలను సెక్యూరిటీ కార్యాలయంలో భద్ర పరిచారు. వాటి విలువ సుమారు రూ.10 పది లక్షలు ఉంటుందని అంచనా. చెట్లను నరికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వాటని సొమ్ము చేసుకోవడంలో సింగరేణి అధికారులు అలసత్వం వహిస్తున్నారనడానికి ఆ దుంగలకు పడుతున్న చెదలేనిదర్శనం. సింగరేణి సొత్తు అన్యాక్రాంతం కాకఁండా నిత్యం కాపలా కాసే కార్యాలయంలోనే అత్యంత విలువైన టేకు దుంగలు చెదల పాలవడం శోచనీయం. ఇప్ప టికైనా కలప పూర్తిగా నాశనము కాకముందే అధికారులు వాటి పట్ల శ్రద్ధ వహించాలని కార్మిక సంఘాల నాయకులు సూచిస్తున్నారు.