Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న మేదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజరు కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు ప్రతాపగిరి శ్రీనివాస్ అధ్యక్షతన సంఘం సభ్యుల సమావేశం కాజీపేట నందు శనివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలలో వెనకబడి వున్న మేదరులను సీఎం చంద్రశేఖర్‌రావు ఆదుకోవాలని కోరారు. మేదరుల కుల వృత్తి అటవీ సంపద వెదురు బొంగులతో తయారు చేసే వస్తువులు మేదరులు ఊరూరా తిరిగి అమ్ముకొని జీవనం కొనసాగించేవారు. నేటి నవ నాగరిక సమాజం లో కుల వృత్తితో తయారు చేసే వస్తువులకు పోటిగా మార్కెట్ రంగంలోకి ప్లాస్టిక్ వస్తువులు మేదరులు తయారు చేసిన వస్తువులు అమ్ముడుపోక, తినటానికి తిండి, ఉండటానికి ఇండ్లు లేక, పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మేద రుల అభివృద్ది కొరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఇండ్లు కేటాయిస్థూ, స్థలం ఉండి ఇల్లుకట్టుకోలేని పరిస్థితి ఉన్న వారికి ప్రభుత్వం ఇస్థున్న 3 లక్షలు ఇవ్వాలని, విదేశీ విద్యానిధి ద్వారా ఉన్నత చదువులు చదువుకోవటానికి అవకాశం కల్పిస్తూ మేదరులు కులవత్తి చేసుకోవటానికి ఉపయోగించే వెదురు బొంగులను గతంలో ఉన్న బ్యాంబు సోసైటీలలో ఉన్న సభ్యులకే కాకుండా కొత్తగా సోసైటిలు ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం కల్పిస్థూ ప్రతి ఒక సభ్యునికి ఉచితంగా 2500 వెదురు బొంగులను అందిం చాలని సంధర్బంగా డిమాండ్ చేశారు. సంఘ భవణ మునకు స్థలం కేటాయించి, భవణ నిర్మాణమునకు నిధి కేటాయించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్య దర్శి వలిపిరెడ్డి సుదీర్ కుమార్, కోశాధికారి ఎనగందుల నరేందర్, ప్రచారకార్యదర్శి మస్న విజేందర్, నాయకులు మస్న శంకర్,మ్నెలుగూరి వెంకటేశ్,కోరుట్ల రాజు, దీకొండ రమేష్, తదితరులు పాల్గొన్నారు.