Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మండలాలకు 8 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు సిగ్గుచేటు..
- జిల్లాలో పోలీస్ పోస్టుల సంఖ్య పెంచాలి
- జిల్లా కన్వీనర్ వేల్పుల రాజ్‌కుమార్
నవతెలంగాణ-భూపాలపల్లి
పోలీస్ నోటిఫికేషన్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అన్యాయం జరిగిందని జిల్లాలో పోస్టుల సంఖ్య పెంచాలని 317 జీవో రద్దు చేసి స్థానికంగానే ఉద్యోగులను కేటాయించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వేల్పుల రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ రాజు కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెనుకబడిన టువంటి భూపాల పల్లి జిల్లా పైన నిరుద్యోగ పైన చిన్నచూపు చూస్తుందని రాష్ట్రంలో 317 జీవో తీసుకువచ్చి సీనియర్ ఉద్యోగులకు మరియు జూనియర్ ఉద్యోగుల మధ్య చిచ్చు రేపి స్థానికం గానే ఉద్యోగాలు అన్న కెసిఆర్ నేడు ఇష్టమైన రీతిలో బదిలీలు చేపట్టి న కారణంగా నేడు ప్రభుత్వం ఇచ్చిన టువంటి ఈ పోలీస్ నోటిఫికేషన్లో భూపాలపల్లి జిల్లా కు కేవలం సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 8 మాత్రమే కేటా యించడం సిగ్గుచేటని, ప్రభుత్వ ఉద్యోగులను భయ బ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తాం బదిలీ చేస్తాం అనడం బాధా కరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య ను భూపాలపల్లి జిల్లాలో పెంచాలని ,317 జీవోను రద్దుచేసి ఇ స్థానికంగానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో గన పురం మండల కన్వీనర్ గంధం సాంబరాజు, నగేష్, ఆశ్రిత్, కష్ణ, రవి పాల్గొన్నారు.