Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని చౌటపల్లి బతుకమ్మ తల్లి జన్మస్థలం, లక్ష్మణ, ఆంజనేయ, సీతా రామచంద్రుల నూతన దేవాలయ నిర్మాణం ఇటీవలే పూర్తి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కష్ణాజిల్లా గుడివాడ వాస్తవ్యులు రాచకఁళ్ళ బాబూరావు పూర్వీకులు సుమారు 100 సంవత్సరముల క్రితం తయారు చేయించిన లక్ష్మణ, ఆంజనేయ, సీతా రామ చంద్రుల 4 పంచలోహ విగ్రహాలను, సీతమ్మవారి బంగారు మంగళ సూత్రాలను కడప జిల్లా పొద్దుటూరులో కట్టు దిట్టమైన ఏర్పాట్ల మధ్య భద్రపరిచి ఉండగా వాటిఁ చౌటపల్లి వాస్తవ్యులు గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత డాక్టర్ శాంతిక్రిష్ణ ఆచార్యులకు ఇటీవలే బాబురావు బహూ కరించినట్లు శాంతికష్ణ తెలిపారు. భద్రపరచిన విగ్రహాలను చౌటపల్లి గ్రామవాసి కొడితాల శ్రీమన్నారాయణ, మిట్టపల్లి సం పత్ సహకారంతో ఓరుగల్లుకు తరలించారు. అత్యం త విలువైన పంచలోహ విగ్రహాలను డాక్టర్ శాంతిక్రిష్ణ ఆచార్యులు ఈనెల 12న వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పంచా యతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా నూతన ఆలయానికి బహూకరించి భక్త జాతికి అంకితం చేయనున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలి పారు. అనేకమంది విరాళ దాతల సహకారంతో గ్రామం లో శివాలయము, రామాలయము ఇటీవలే నిర్మించు కున్నా రన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో వేదపం డితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా ఆల యాలను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.