Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ నిపుణుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ రాజిరెడ్డి
నవతెలంగాణ-జనగామ
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని వ్యవసాయ నిపుణుడు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ ఆచార్య దండ రాజిరెడ్డి రైతులకు సూచించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక పూసల భవనంలో రాపర్తి రాజు అధ్యక్షతన వానకాలంలో వ్యవసాయ సాగుపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో రాజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. లాభసాటి పంటల వైపుకు మొగ్గు చూపాలని సూచించారు. వ్యవసాయం పూర్తిగా రుతు పవనాల ఆగమనం, విస్తరణ, నమోదయ్యే వర్షపాతంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం పెరిగిందన్నారు. నీటి వనరులు పెరగడం ద్వారా పెరిగిన సాగు విస్తీర్ణం సాధ్యమైందని చెప్పారు. ఒకే పంట విధానం మంచిది కాదన్నారు. వరి విస్తీర్ణం తగ్గించి మిగతా పంటలు పండించాలని సూచించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మార్కెట్లో ధరల అనిశ్చితి లాంటి వాటిని తట్టుకోవడానికి పలు పంటల విధానం పాటించాలని చెప్పారు. వరికి బదులు ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, మోకు కనకారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగ నర్సింహ, జిల్లా సహాయ కార్యదర్శి భూక్య చందు నాయక్, జిల్లా అఫీస్ బేరర్ మాచర్ల్ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.