Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు చాలీ చాలని వేతనాలు
- ధరలపరుగుదలపై పోరాటానికి సిద్ధమవుతున్న వామపక్ష పార్టీలు
నవ తెలంగాణ-హన్మకొండ
ఇండియా మరో శ్రీలంక కాబోతుందా అనే అను మానాలు సగటు మానవుని మదిలో ఆలోచనలు మెదులు తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు పూర్త వుతున్నాయి. వీరు అధికారంలోకి వచ్చే నాటికి ఈనాటికీ నిత్యావసర ధరలు పరిశీలిస్తే సగటు మానవుని గుండె గుబేల్మంటుంది ఇప్పటి పరిస్థితి.నాలుగు వందల ముప్పై రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం వెయ్యి యాభై రూపాయలు, 60 రూపాయల పెట్రోల్ ప్రస్తుతం 110 రూపాయలు, డీజిల్ 55 రూపాయలు ఉంటే ప్రస్తు తం 95 రూపాయలు ఉంది 55 రూపాయలు ఉన్న కిలో మంచి నూనె ప్రస్తుతం రూ.210 ఈ అంకెలు చాలు ప్రస్తుతం వేతన జీవుల పరిస్థితి . ఇక కూరగాయల రేట్లు అమాంతం పెరిగాయి. కొండెక్కిన చికెన్ ధర నూట నలభై రూపా యలు చికెన్ ప్రస్తుతం రూ.300 పలుకుతోంది. ఇవన్నీ చూస్తే ఎంతినే తట్టులేదు ఏం కొనేటట్టు లేదు రాజి గో రాజన్న అనే పాట గుర్తుకొస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. వేతనాలు బా గానే ఉన్నా ప్రతి నెల 1న రావాల్సిన వేతనాలు 10 వరకు కూడా వేతనాలు చేతికి అందకపోవడంతో లోన్ పెట్టి ఇం డ్లు తీసుకున్న వారు కొందరైతే ద్విచక్ర వాహనాలు, కార్లు తీసుకున్న మరికొందరు సకాలంలో ఈఎంఐలు చెల్లిం చకపోవడంతో చెక్ బౌన్స్లు అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇక కిరాయి ఇళ్ల లో ఉండేవారు ఇంటి అద్దె సమయానికి ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చ ేస్తున్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరీ దారు ణంగా ఉంది కరోనా పుణ్యమా అని కొన్ని యాజమాన్యాలు సగం వేతనాలు ఇస్తే మరికొందరు వేతన మొత్తం ఇవ్వ కుండా ఇబ్బంది పెట్టారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మనం మరిచిపోలేము. ఒకప్పుడు పెట్రోలు రూ.2 పెరిగిన ఆర్టీసీ బస్సుచార్జీలు రూపాయి పెరిగిన ప్రజలు ధర్నాలు రాస్తారోకోలు చేసే వా రు కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు ప్రజల ఆలో చనలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు పోటీపడి నిత్యావసర ధరలు గ్యా స్ పెట్రోల్ డీజిల్ ధరలు కరెంటు చార్జీల పెరుగుదలపై వా మపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధ మవుతున్నాయి.