Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనసేవాదల్ రాష్ట్ర శిక్షణా శిబిరం ప్రారంభం
నవతెలంగాణ-మహబూబాబాద్
కమ్యూనిస్టులే దేశ రక్షకులని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తోట విజరు ప్రాంగణంలో (బాలాజీ గార్డెన్స్) జనసేవాదల్ రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించి పార్టీ పతాకాన్ని ఎగరేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి విజయ సారథి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతోన్మాద విచ్చిన్నకర శక్తులు పెరిగిపోయాయని తెలిపారు. మైనార్టీలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన మతతత్వ శక్తులను జనసేవాదల్ సైనికులు తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జనసేవా దల్ రాష్ట్ర ఇన్స్ట్రక్టర్లు పంజాల రమేష్, గోషిక మోహన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌స్టాలిన్, శివరామకృష్ణ, మహబూబాబాద్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అజరు, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకుడు కనుకుంట్ల శంకర్, జిల్లా నాయకులు పెరుగు కుమార్, చింతకుంట్ల పాండురంగాచారి, వరిపెల్లి వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, అలీమా, వీరవెల్లి రవి, రేషపల్లి నవీన్, తదితరులు పాల్గొన్నారు.