Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూడబ్లూజే (ఐజేయూ) రాష్ట బాధ్యులు విరహత్ అలీ
నవతెలంగాణ-మరిపెడ
సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు సంఘటితంగా పోరాడాలని టీయూడబ్లూజే (ఐజేయూ) రాష్ట బాధ్యుడు విరహత్ అలీ కోరారు. మండల కేంద్రంలోని గెస్ట్‌హౌజ్‌లో స్థానిక జర్నలిస్టులు శనివారం ఇచ్చిన తేనీటి విందుకు ఆయన హాజరై మాట్లాడారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు, ఇండ్ల స్థలాలు, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత కార్డులు అందించాలని కోరారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు సంబంధించి పటిష్టమైన సవరణ చేయాలన్నారు. కార్డుల జారీలో యాజమాన్యాలు పారదర్శకత పాటించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాతీయ నాయకులు దాసరి కష్ణారెడ్డి, దూలం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు అడ్డగోడ రాజేష్, శంకర్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంనారాయణ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఆవుల యుగేందర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అద్యక్షుడు అశోక్, డోర్నకల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సీతారామ్, ఐజేయూ జిల్లా ఉపాధ్యక్షుడు గంధసిరి రవి, మండల బాధ్యులు షేక్ అక్తర్ పాషా, గాడిపెళ్లి శ్రీశైలం, సత్తార్ పాషా, మారం అనంతరాములు, జిన్న లచ్చయ్య, మచ్చ రాజేష్, బోడ శ్రీను, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కాలం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరంగం శ్రీనివాస్, మహేందర్, మహ్మద్ రియాజ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.