Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
- కొనసాగుతున్న పల్లెప్రగతి
నవతెలంగాణ-ములుగు
రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం 5వ విడత పల్లె ప్రగతి చేపట్టిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మండలంలోని జంగాలపల్లిలో శనివారం చేపట్టిన కారక్రమంలో ఎంపీ కవిత, జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్‌లతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివద్ధి చేసేలా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, నర్సరీ, కాంపోస్ట్ షెడ్డు, ట్రాక్టర్ ఏర్పాటు చేశామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఏవైనా లోటుపాట్లుంటే సవరించాలని సూచించారు. గ్రామంలో మహిళల కమ్యూనిటీ భవనానికి రూ.15 లక్షలు మంజూరు చేస్తామని సర్పంచ్‌కు హామీ ఇచ్చారు.
ఇంచర్లలో..
గ్రామంలోని గట్టమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ అక్కడ నిర్మించనున్న కమ్యూనిటీ కిచెన్ షెడ్లకు శంకస్థాపన చేశారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి, డీఆర్వో రమాదేవి, డీఆర్డీఓ వెంకటనారాయణ, జెడ్పీ సీఈఓ రమాదేవి, డీపీఓ వెంకయ్య, డీఎల్పీఓ దేవరాజ్, సర్పంచ్ మస్రగాని అనిత, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలత, ఇంచర్ల సర్పంచ్ మోరే రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండలంలోని చల్వాయిలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని, గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించి మాట్లాడారు. పల్లె ప్రకతి వనంలోని వాకింగ్ ట్రాక్‌ను అందంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. చల్వాయిలో లక్నవరం పర్యాటకుల కోసం కమ్యూనిటీ కిచెన్ షెడ్ పనులను ప్రారంభించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాటి, గణేష్, ఏఎస్పీ సుధీర్ కేకన్, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ అల్లం రాజ్‌కుమార్, జెడ్పీటీసీ హరిబాబు, సర్పంచ్ ఈసం సమ్మయ్య, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, గోవింద్‌నాయక్, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : మండలంలోని ముడుపుగల్లోని వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించి మాటాల్డఆరు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమ, పంచాయతీ సెక్రటరీ స్పందన, జెడ్పీటీసీ ప్రియాంక, ఎంపీడీఓ వెంకట్‌రెడ్డి, ఎంపీఓ హరిప్రసాద్, ఏపీఓ ప్రదీప్, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ సాయిబాబా, టెక్నికల్ అసిస్టెంట్ స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూర్ రూరల్ : మండలంలోని సోమారపుకుంటతండాలో రూ.4 లక్షల వ్యయంతో చేపట్టిన సైడ్ డ్రెయినేజీ కాల్వలకు జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, సర్పంచ్ యాకమ్మ కిషన్‌నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ ఫ్లోర్‌లీడర్ శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకన్న, వార్డ్ సభ్యుడు నీలమ్మ రవి, రెడ్యా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర : మండల కేంద్రంలో సర్పంచ్ వెనకదాసుల లక్ష్మీ శర్మ కాల్వలోకి దిగి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పలు గ్రామాల్లో పల్లె ప్రగతి నిర్వహించగా ఎంపీపీ రాజేశ్వరి, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి, పాలకుర్తి ఆలయ కమిటీ చైర్మెన్ రామచంద్రయ్య శర్మ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకన్న, మాజీ ఎంపీటీసీ జగదీష్, నాయకులు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండల కేంద్రంలోని ముస్తఫ్నాగర్లో గుర్తించిన మురుగునీటి కాల్వలను శుభ్రం చేయాలని ఎంపీడీఓను, సర్పంచ్‌ను జెడ్పీ చైర్పర్సన్ బిందునాయక్ ఆదేశించారు. తానే స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. స్థానిక బాలుర హైస్కూల్‌ను సందర్శించి శ్రమదానం కింద పాఠశాలలను కళాశాలను శుభ్రం చేయించాలని చెప్పారు. జ్యోతిక అనే వికలాంగురాలికి అత్యవసరమైన బ్యాటరీ సైకిల్ ఇప్పించాలని డీడబ్యుఓను ఫోన్ ద్వారా ఆదేశించారు.కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్ మూల మధుకర్‌రెడ్డి, సర్పంచ్ ధనసరి కోటమ్మ, ఎంపీడీఓ చలపతిరావు, ఎస్బీఎం రవి, ఎంపీఓ రఫీ, ఉపసర్పంచ్ వీరబోయిన కవిత సంపత్, కార్యదర్శి మమత, వార్డు సభ్యులు పోతుగంటి సుమన్, బొమ్మగాని అనిత శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
జనగామ : జిల్లా కేంద్రంలోని ధర్మకంచ, శామీర్‌పేట, బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. అధికారులకు పలు సూచనలు అందించారు. తొలుత ధర్మకంచలో నిర్మిస్తున్న వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. మండలంలోని శామీర్‌పేటలోని గ్రామ పంచాయతీని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనులను సమర్ధవంతంగా నిర్వహించాలని, పంచాయతీ బలోపేతం కోసం నూరు శాతం పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. గ్రామంలోని ఎస్టీ హాస్టల్‌ను సందర్శించి వార్డెన్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళం తీయించి రికార్డులను పరిశీలించారు. తొలుత పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. అలాగే అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పెంబర్తి, ఓబుల్ కేశ్వాపూర్, సిద్దెంకి, పెద్దరాంచర్ల గ్రామాల్లో అభివద్ధి పనులను పరిశీలించారు. జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి గానుగుపహాడ్, పెద్దపహాడ్, మరిగడి, ఎర్రగొల్లపహాడ్, పెద్దతండ గ్రామాల్లో పనులను తనిఖీ చేశారు.
బచ్చన్నపేట : మండలంలోని తమ్మడపల్లిలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య పర్యటించి మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా లూజ్ వైర్లను సరి చేయించాలని, అవసరమైన చోట పోల్స్ వేయించాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తమ్మడపల్లి సర్పంచ్ మేకల కవిత రాజు, తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : మండలంలోని లచ్చతండా, ఎడ్చర్ల గ్రామాల్లో పల్లె ప్రగతి నిర్వహించగా ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు, జెడ్పీటీసీ శారద రవీందర్, ఎంపీడీఓ కేలోతు ధన్ సింగ్ కలిసి పర్యటించారు. ఆయా వార్డుల్లోని సమస్యలను పరిశీలించి సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో అయా గ్రామాల సర్పంచ్‌లు భిక్కు, అనూష వెంకన్న, పంచాయతీ కార్యదర్శులు అశోక్, లత ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘణపురం : మండలంలోని లింగాలఘనపురం, బండ్లగూడెం, గుమ్మడవెల్లి, సిరిపురం, నెల్లుట్ల, కొత్తపల్లి, జీడికల్, నేలపోగులల్లో పల్లెప్రగతి నిర్వహించగా ఎంపీపీ చిట్ల జయశ్రీ, జెడ్పీటీసీ వంశధర్రెడ్డి మాట్లాడారు. కార్యక్ర మంలో సర్పంచ్‌లు విజయ మనోహర్, విజయ, శ్రీపాల్‌రెడ్డి, రాజు, లక్ష్మీ, స్వరూప రాణి, స్రవంతి, గణపతి, ఎంపీటీసీలు భిక్షపతి, కిరణ్‌కుమార్, మాధవి, మంగమ్మ, మండల ప్రత్యేక అధికారి లత, ఎంపీడీఓ సీతారామ్, ఎంపీఓ మల్లికార్జున్, దిశ సభ్యురాలు భాగ్యలక్ష్మి, సమన్వయకర్త నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.