Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైస్ ఎంపీపీ శ్యాంసుందర్‌రెడ్డి
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని వైస్ ఎంపీపీ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఫత్తేపురంలో సర్పంచ్ గూడెల్లి సోమనర్సమ్మ వెంకన్న, హెచ్ఎం వెంకన్న కలిసి బడిబాట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు నాణ్యమైన బోధన అందించేలా ప్రభుత్వం కషి. చేస్తోందని చెప్పారు. మొదటి విడతలో ఎంపిక కానీ పాఠశాలలను రెండో విడతలో ఎంపిక అవుతాయని తెలిపారు. కార్యక్రమంలోవార్డు సభ్యులు పెద్ది మహేంద్ర, రైతుబంధు సమితి సభ్యుడు గూడెళ్లి నర్సయ్య, మాజీ వార్డు సభ్యుడు సండ్ర ముత్యాలు, ఉపాధ్యాయుడు యాకయ్య, అంగన్వాడీ వర్కర్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : మండలంలోని ఆమనగల్ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఆమనగల్ శివారు గుండాలగడ్డ, కాశనతండాల్లో బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుగులోత్ సత్య శంకర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బలాస్టి రమేష్, రామాచారి, హైమా, దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.మరిపెడ : సీతారాంపురం జెడ్పీ హైస్కూల్లో బడిబాట నిర్వహించారు. ఉపాధ్యాయులు భూక్య నాగేష్‌నాయక్, భూక్య శౌరి, బేతమల్ల ప్రేమ్‌సాగర్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరమణ, మంగీలాల్, అంగన్వాడీ టీచర్ శ్రీలత, తదితర ఉపాధ్యాయులు సీతారాంపురం కాలనీ, చోక్లా తండా, బోడ తండ, కార్గిల్ సెంటర్లో బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా హైస్కూల్లో 11 మందిని, ప్రాథమిక పాఠశాలలో ఆరుగురిని ఎన్రోల్ చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుడు భూక్య నాగేష్ నాయక్ మాట్లాడారు.
కొత్తగూడ: మండల కేంద్రంలో బడిబాట నిర్వహించగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాసం పాపయ్య ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిసి విద్యార్థుల వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం పాపయ్య మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈసం సారంగపాణి, సిహెచ్ సరస్వతి, ఏ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.