Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
అడిగిన ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించాలని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అధికారులకు సూచిం చారు. మండలంలోని కాన్వాయిగూడెంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని, ప్రతిరోజు రూ.257లకు తగ్గకుండా వేతనం అందేలా పనులు కల్పించాలని అధికారులను కోరారు. అనంతరం రూ.20 లక్షలతో మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను పాలకుర్తి ఆలయ కమిటీ చైర్మెన్ రామచంద్ర శర్మ, సర్పంచ్ మద్దెల కరుణతో కలిసి ప్రారంభించారు. గ్రామాలను అభివద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలయ్య, ఎంపీటీసీ అనురాధ, కార్యదర్శి జగదీష్, ఉప సర్పంచ్ చంద్రయ్య, నాయకులు ఆంజనేయులు, వెంకన్న, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.