Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నందిపాడు' ప్లాంటేషన్ పనులను ఆపాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-వెంకటాపూర్
మండలంలోని లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నందిపాడు గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలు చేయడం సరికాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రత్నం రాజేందర్ అన్నారు. తిరుమల వాగు పక్కన సాగు చేసిన పోడు భూమిలోకి అటవీ శాఖ అధికారులు డోజర్‌తో వచ్చి చదును చేస్తుండగా గిరిజనులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గఫూర్‌పాషా కలిసి రాజేందర్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాజేందర్, గఫూర్ పాషా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామంటూనే అటవీ శాఖ అధికారులతో దాడులు చేయిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా వెంటనే పోడుభూములకు సంబంధించి అర్హులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరేష్, భీమా, ముకేష్, పొజి, రాము, చందు, మంగమ్మ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.