Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్
నవతెలంగాణ-గూడూరు
గ్రామీణ యువత క్రీడా ప్రాంగణాలను వినియోగించుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ కోరారు. మండలంలోని నాయకపల్లి, తీగలవేణి గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలు అన్ని రంగాల్లో అభివద్ధి చెందేలా కోట్లాది రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. అన్ని గ్రామాలలో త్వరలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు కాసీమ్, ఎంపీపీ బానోత్ సుజాత మోతీలాల్ నాయక్, వైస్ ఎంపీపీ ఆరె వీరన్న, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ ప్రసాదరావు, తీగలవేణి ఎంపీటీసీ వేం వాసుదేవరెడ్డి, సర్పంచ్ ప్రేమ్ శైలజ మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకట కష్ణారెడ్డి, ఈజీఎస్ ఏపీఓ బన్సీలాల్, తీగలవేణి స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవి, నాయకపల్లి స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.