Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని గుండెంగ గ్రామపంచాయతీ పరిధిలోని గుడితండ, దొంగచింతల్తండ వద్ద గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ ఎస్సై జయశ్రీ ఆధ్వర్యంలో శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 9 లీటర్ల ఐడీ మద్యం, 20 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకుని, 300 లీటర్లను ధ్వంసం చేశారు. నలుగురిని గుర్తించి ముగ్గురిని తహసీల్దార్ అశోక్‌కుమార్ ఎదుట బైండోవర్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు ఎస్సై చెప్పారు. ఈ సందర్భంగా తండాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుడుంబా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. దాడులో హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య, కానిస్టేబుళ్లు సుధాకర్, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.