Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతతో ఇక్కట్లు
నవతెలంగాణ-మల్హర్రావు
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసిన విషయం విధితమే. ఉజ్వల పథకం కిందా వంట గ్యాస్ సిలిండర్లు పొందినవారికి రాయితీ ఇస్తామని ప్రకటించింది. మిగతా వినియోగదారులు అందరూ మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. నెలకొక్క సిలిండర్ చొప్పున ఏడాదికి 12 సిలిండర్లు ప్రభుత్వం రాయితీపై ఇస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ను రీఫిల్లింగ్ చేసుకున్న తరువాత రాయితీ మొత్తాన్ని వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమచేస్తూ వస్తోంది. ఇప్పుడిలా కాకుండా ఉజ్వల కనెక్షన్లు ఉన్నవారికి మాత్రమే సబ్సిడీ అందనుండగా ఇతర కనెక్షన్లు ఉన్నవారికి కేంద్రం మొండిచేయి చూపించింది. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడతున్న పరిస్థితి.
మండలంలో మొత్తం 8,341 కనెక్షన్లు ఉండగా, ఇందలో దీపం పథకం కింద 850, ఉజ్వల కనెక్షన్లు 1000, రెగ్యులర్(ఈర్ఏస్) కింద 3000, సింగిల్ 2.291, డబుల్ 500 కనెక్షన్లు ఉన్నాయి. వంటగ్యాస్ సబ్సిడీ ఎత్తివేయడంతో మండలంలో 7,341 వేల లబ్ధిదారులపై భారం పడనుంది. ఉజ్వల మినహా ఇతర కనెక్షన్లు ఉన్నవారు నెలకొక్క సిలిండర్ చొప్పున తీసుకున్నా ఏడాదికి 88,092వేల సిలిండర్లు అవసరం. ఒక్కో సిలిండర్ పై ప్రభుత్వం అందజేసే రాయితీ రూ.45 చొప్పున లెక్కవేసినా ఏడాదికి మండల వినియోగదారులపై రూ.39.64.140 లక్షల భారం పడనుంది. ప్రభుత్వం వంటగ్యాస్ పై ఇచ్చే సబ్సిడీని ఒకేసారి ఎత్తివేయకుండా ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వచ్చింది. 2015లో గ్యాస్ సిలిండర్ ధర రూ.665 ఉండగా రాయితీ రూ.250 వరకు వచ్చేది.ఇలా నాలుగేళ్లపాటు అంటే 2019 ఆఖరు వరకు గ్యాస్ సబ్సిడీ ఇవ్వగా కారోనా సమయంలో రాయితీని ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది.2020లో ఒక్కొక్క సిలిండర్ ధర రూ.755 నుంచి రూ.840 వరకు ఉండగా రాయితీ రూ.45 చొప్పున ఖాతాల్లో జసమ చేస్తూ వచ్చింది. గతేడేదిన్నర నుంచి సబ్సిడీ సైతం రావడం లేదు. ప్రస్తుతం ఒక్కొక్క సిలిండర్ ధర రూ.బహిరంగ మార్కెట్లో రూ.1110 ఉంది. ఉజ్వల లబ్ధిదారులు రూ.1110 చెల్లించి కొనుగోలు చేస్తే వారి ఖాతాల్లో రూ.250 రాయితీ జమ కానుంది. మిగతా వినియోగదారులు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే.
రాయితీ ఎత్తివేయడం సరికాదు
ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు బగ్గుమంతున్నాయి.బహిరంగ మార్కెట్లో సరుకులు కొనుగోలు చేయాలంటే వందలు,వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో గ్యాస్ సబ్సిడీ ఎత్తివేయడం సరికాదు.ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలి.
-తిరుమల, గృహిణి
సరైన నిర్ణయం కాదు
వంటగ్యాస్ రాయితీని ఎత్తివేయడం సరైన నిర్ణయం కాదు. ఏబ వస్తువు కొనుగోలు చేసిన ఎక్కువ ధరయే ఉంది.వంటగ్యాస్ ధర కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో ప్రజలకు కొంత భరోసా ఇవ్వాల్సి పోయి ఉన్న సబ్సిడీ ఎత్తివేస్తే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు.
- అక్కల బాపుయాదవ్, ప్రజా సంఘాల నాయకుడు