Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం నవతెలంగాణ- కోల్బెల్ట్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని భూపాలపల్లి ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం అన్నారు. ఆదివారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి పాఠశాల విద్యార్థులు, రెస్క్యూ, ఎస్ అండ్ పిసి సిబ్బందితో కలిసి జయశంకర్ జిల్లా కేంద్రంలో క్రిష్ణ కాలనీ నుండి జిఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధికార ప్రతినిధి అజ్మీర తుకారం మాట్లాడుతూ పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవం గా ప్రకటించిందని అన్నారు. పారిశ్రామిక విప్లవం పేరుతో చెట్లను నాశనం చేయడం వల్ల వాతావరణ ఉష్ణోగ్రత, కాలుష్యం పెరిగి , పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటాలని సూచించారు. అనంతరం ఏరియా పర్యావరణ అధికారి కష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పరిశ్రమల మూలంగా క్లోరో ఫ్లోరో కార్బన్ విడుదలై ఆకాశంలోని ఓజోన్ పొర దెబ్బతిని భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని వివరించారు. ఈ నష్టాన్ని నివారించాలంటే చెట్ల పెంపకమే ఏకైక మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంఛార్జి జీఎం బివి రమణ, ఎస్ఓటు జిఎమ్ ఆర్. విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ శివ కేశవ రావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మహమ్మద్ షరీఫ్, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ ఉత్తమ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడుదాం
లింగాలఘణపురం : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యా వరణ దినోత్సవం సందర్భంగా చీటూరు గ్రామంలో మొక్కలను నాటారు. సర్పంచ్ మల్లేశం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే లింగాల గణపురం వివేకానంద పార్క్ లో రెండు మొక్కలు నాటారు. పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ , బోయిని సురేష్ , బెజ్జం రవి , కేమిడి సత్యనారాయణ , ఓడపల్లి శ్రీధర్ , రాపోలు సమ్మన్న పాల్గొన్నారు.
నర్మెట్ట : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్మెట్ట మోడల్ స్కూల్ లో ఆదివారం బీజేపీ ఆద్వర్యంలో మొక్కలు నాటారు. మండల అధ్యక్షులు ధరావత్ రాజు నాయక్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు బానోత్ కోటి, కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శి బైరగోని ఆంజనేయులు,గిరిజన మోర్చా అధ్యక్షులు కొర్ర సాయి నాద్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జంగిటి నాగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.