Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నామమాత్రంగా 'మన ఊరు-మన బడి'
- వారం రోజుల్లో ప్రారంభం కానున్న పాటశాలలు
నవతెలంగాణ-మల్హర్రావు
ఊరించి ఉసురుమనిపించినట్లుంది 'మన ఊరు-మనబడి' కార్యక్రమం. బడుల్లో సౌకర్యాలు మెరుగు పర్చేందుకు, ప్రయివేటు పాటశాలలకు ధీటుగా విద్య నంధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మండలంలో మొత్తం 37 పాఠశాలలకు 14 పాటశాలలను తొలి విడతగా ఎంపిక చేశారు. వివిధ రకాలైన మౌలిక సౌకర్యాలు మెరుగుపర్చేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతగా ప్రారంభమైన మన ఊరు మనబడి ఆధునీకరణ అభివద్ధి పనులు నత్తనడకన సాగుతు న్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి గాను పాఠ శాలలు ఈ నెల 13న పునర్ ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లోనే ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, నిధుల విడుదల విషయంలో అలసత్వం వహించడంతో కొన్ని పాఠశాలల్లోనే పనులు సాగుతున్నాయి. తొలి విడుతలో ఎంపికై నిధుల మంజూరుకు నోచుకోని పాటశాలల్లో పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత లేకుండాపోయింది. బడ్జెట్లో మన ఊరు మనబడి కార్యక్రమానికి నిధులను కేటాయించిన పాటశాలల్లో సౌకర్యాలను మెరుగు పరచడానికి నిధులు విడుదల చేయకపోవడంపై విద్యా అభిమానులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి నిధులను విడుదల చేసే విషయంపై పరిశీలన చేయాలని పలువురు సూచిస్తున్నారు.