Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు ఘటనల్లో ఆరుగురు మృతి
- ములుగు, జనగామ జిల్లాల్లో..
నవతెలంగాణ-ఏటూరునాగారం/రఘునాథ్‌పల్లి
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వద్ద 163వ నెంబర్ జాతీయ రహదారిపై ఏటూరు నాగారం వైపు నుంచి ఇసుక క్వారీకి వెళ్తున్న లారీ ముళ్లకట్ట రాంపూర్ వైపు నుంచి వస్తున్న స్కార్పియో కారు ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో ములుగు జిల్లాలోని జాకారం గ్రామానికి చెందిన వల్లాల కృష్ణయ్య (45), శివ (17) అక్కడికక్కడే మృతి చెందారు. అదే జిల్లా ఘన పురం గ్రామానికి చెందిన మొసలి రాజేందర్ తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు చికిత్స కోసం ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రమాద స్థలిని ఏటూరునాగారం సీఐ సట్ల కిరణ్‌కుమార్, ఎస్సై రమేష్ చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలంలోని గోవర్ధనగిరి దర్గా వద్ద హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వస్తున్న కారు టైరు పేలి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో వరంగల్‌లోని చింతల్ ప్రాంతానికి చెందిన షౌకత్ హుస్సేన్ (56), నజీనా బేగమ్ (40), అమీనా బేగమ్ (50) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే రుమేజా మహ్మద్, గౌసియా బేగమ్, హైమత్ అలీ, రోషన్, హకీమ్, హిమాయత్ అలీ తీవ్ర గాయాలపాలు కాగా పోలీసులు వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిని స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ రఘుచందర్, రఘునాథ్‌పల్లి రూరల్ సీఐ వినరుకుమార్, తదితర పోలీసు అధికారులు, సందర్శించి విచారణ చేపట్టారు.