Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ జనగామ
జనగామ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగల్స్ ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి జోగ్ ప్రకాష్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యా లయంలో ఎండీి అజారుద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనగామ పట్టణ కేంద్రంలో ఎస్సై సాయి దివ్య ట్రాఫిక్ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, దానికి నిరసిస్తూ నేడు చలో జనగామ పోలిస్ స్టేషన్ కార్య క్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జనగామ పట్టణంలో సుందరీకరణ పేరుతో ఇరువైపులా రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో ఎస్ఐ చిరు వ్యాపారులను తోపుడుబండ్ల వ్యాపారస్తులను తదితర వారిపై రోడ్డుపై బండ్లు నిలిపారంటూ ఫైన్లు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వైన్ షాపులకు, సిట్టింగ్ అనుమతినిస్తూ బెల్టు షాపులను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు సక్రమంగా విధులు నిర్వర్తంచడం లేదన్నారు. నేడు బాధితులు అందరూ వచ్చి కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలన్నారు. పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్, ఇర్రి అహల్య బోట్ల శేఖర్. బూడిద గోపి, పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్, బాల్ ని వెంకట మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.