Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నేడు పదవతరగతి మూల్యాంకన కేంద్రం(ఫాతిమా హై స్కూల్) వద్ద జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని యూఎస్పీసీ జనగామ స్టీరింగ్ కమిటీ సభ్యులు రంజిత్ కుమార్, లక్ష్మయ్య, రాం రెడ్డి విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం ముఖ్యనాయకుల సమావేశంలో సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన బదిలీలు, ప్రమోషన్స్ ఇప్పటికి నెరేవేరకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. వేసవి సెలవులు పూర్తి కావొస్తున్నాయని ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ,ఉపాధ్యాయులంతా తమ నిరసనను స్పాట్ కేంద్రాలలో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆకుల శ్రీనివాస రావు, నాగుల రాజు, దివాకర్ రెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్‌రావు, చొక్కయ్య, వెంకటేష్, వజ్రయ్య, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.