Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం
- రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య
నవతెలంగాణ- కోల్బెల్ట్
నేడు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో జరిగే ఆత్మగౌరవ దీక్షను జయప్రదం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని బాతాల రాజ్ భవన్ లో మాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ రత్నం కిరణ్తో కలిసి ఆత్మ గౌరవ దీక్ష పోస్టర్, కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనేక పోరాటాలు, ఉద్యమాలు, బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కి, సీమాంధ్ర బడా కాంట్రాక్టర్లలకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాడని దుయ్యబట్టారు. రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి బేసిన్లు లేవు బేషజాలూ అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి తన స్వప్రయోజనాల కోసం లొంగిపోయిన కేసీఆర్తో కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్ వల్ల తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. తెలంగాణలోని విద్యా వ్యవస్థను కార్పోరేట్ వ్యవస్థకు , రాజకీయ నాయకులకు అప్పగించి ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ గనులతో ఉత్తర తెలంగాణ బొందల గడ్డ గా మారిందన్నారు. తెలంగాణ అమరుల స్వప్నం నెరవేరాలంటే తెలంగాణలో ప్రజాస్వామిక తెలంగాణ రావాలని , దాని సాధనకు తెలంగాణ మేధావులు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సబ్బండ వర్గ ప్రజలు ఆ దిశగా పోరాటం చేయాలని అన్నారు. దీక్షకుఉ తెలంగాణ ఉద్యమ కారులు హాజరై మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం భూపాల పల్లి ఏరియా కార్యదర్శి రాళ్లబండి బాబు ,నాయకులు తాండ్ర రాజనర్సు ,చంద్రయ్య, చంద్రశేఖర్, కిరణ్ పాల్గొన్నారు.