Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్ బెల్ట్
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అవగాహన వారో త్సవాలను విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని జయశంకర్ జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్టాండ్‌లో ఏహెచ్‌టీయూ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి సీఐ వాసుదేవరావు ఆద్వర్యంలో పోలీస్ అవగాహన వారోత్సవాల లో భాగంగా ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై లైంగిక దాడుల, బాండెడ్ లేబర్, బాలకార్మిక, మానవ అక్రమ రవాణా పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలను పనిలో పెట్టుకున్న వారికి రూ.25,000 జరిమానా విధించొచ్చన్నారు. చిన్న వయస్సు లోనే ప్రేమ, పెళ్ళిలకు ఆకర్షితులు కావొద్దని అన్నారు. చదువు తోనే బంగారు భవిష్యత్ ఉంటుందని అన్నారు . గంజాయి, గుట్కా, మద్యానికి బానిసవ్వొద్దన్నారు. కోవిడ్ కారణంగా పాఠశాలలు నడవడం లేదని, ఆర్ధిక సమస్యల కారణంగా పిల్లలను పనిలో పెడుతున్న పరిస్థితులపై ప్రత్యేక దష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, బాధ్యతాయుతంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతానికి సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎహెచ్టీయూ ఎస్ఐ ఉర్మిల, భూపాలపల్లి ఎస్ఐ స్వప్న కుమారి, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.