Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కందకంలో చేరిన మురుగు నీరు
- ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
నవతెలంగాణ-శాయంపేట
శాయంపేట ఆత్మకూరు రోడ్డు నిర్మాణ పనుల కోసం మండల కేంద్రంలో రోడ్డు పక్కన కందకాలు తవ్వి వదిలివేయడంతో అందులో మురుగునీరు చేరి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు సర్పంచ్ కందగట్ల రవి ఇంటి ముందు రోడ్డు పక్కన కాంట్రాక్టర్ సిబ్బందితో గుంతలు తవ్వి వదిలివేశారు. రోడ్డు ఎదురుగానే ఉన్న ప్రభుత్వ కుళాయి నుండి వథా నీరు గుంతలోకి చేరి చిన్నపాటి తటాకాన్ని తలపిస్తుంది. నీటి నిల్వతో దోమల ప్రబలి అనారోగ్యాల బారిన పడుతున్నట్లు కాలనీవాసులు తెలుపుతున్నారు. సర్పంచ్ ఇంటిముందు ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, సామాన్యుల పరిస్థితి ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పల్లె ప్రగతి కార్యక్రమంలో రోడ్డు పక్కన బురద నీరు నిల్వలు లేకుండా చూడాలని, రోడ్డు పనులు చేపట్టి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.