Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-మంగపేట
శనిగకుంట అగ్ని ప్రమాద బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని కోరుతూ అగ్ని ప్రమాద బాధిత నిరాశ్రయుల సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్‌కు మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆదివారం వినతిపత్రం అందించారు. తొలుత జగదీష్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం జగదీష్‌కు నిరాశ్రయుల సంఘం అధ్యక్షుడు తోలెం నాగబాబు, ప్రధాన కార్యదర్శి మంకిడి రాంబాబు వినతిపత్రం అందించి మాట్లాడారు. ప్రమాదం వల్ల 33 ఆదివాసీ గిరిజనులు రోడ్డున పడ్డట్టు తెలిపారు. ప్రభుత్వం తాత్కాలిక సహాయం అందించిందని చెప్పారు. ఉండడానికి ఇల్లు లేని స్థితి నెలకొందని వాపోయారు. ప్రమాదంలో కాలిపోయిన పట్టాదారు, బ్యాంకు పాసు పుస్తకాలు, ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులు, పిల్లలకు సంబందించిన స్టడీ సర్టిఫికెట్లను తక్షణమే అందించాలని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించినా ఇప్పటివరకు అధికారులు అందించలేదని తెలిపారు. ఈనెల 13న విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లల భవిష్యత్ పట్ల ఆందోళనగా ఉందన్నారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పెద్దల నర్సింహారావు, మంకిడి తిరుపతమ్మ, తోలెం సమ్మక్క, తోలెం నర్సమ్మ, తోలెం సుధాకర్, పసుల మంగమ్మ, తోలెం కష్ణయ్య, కాటబోయిన నరేందర్ తదితరులు పాల్గొన్నారు.