Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మండల పరిధిలోని గ్రామం కన్నారం శివారు ఇచ్చులపల్లిలో ప్రభుత్వ భూములను కాపాడి నిరుపేద దళిత కుటుంబాలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇచ్చులపల్లిలో, ప్రభుత్వ భూములను కాపాడి, నిరుపేద దళిత కుటుంబాలకు పంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల రవి ఆధ్వర్యంలో నిరుపేద దళిత కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ తాలూకా, తుమ్మనపల్లి అనే గ్రామం నుండి సుమారుగా 122 సంవత్సరాల క్రితం నాలుగు కుటుంబాలు ఈ గ్రామానికి వచ్చి, భూమిని పోడు కొట్టుకుంటూ చదును చేస్తూ, వర్షాధార పంటలు పండిస్తూ జీవనం కొనసా గిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 100 కుటుంబాలు కొన్ని కుటుంబాలు వలస వెళ్లారన్నారు .సర్వే నంబర్ 70,71లో భూమిని సాగు చేస్తున్న సందర్భంలో దళితుల మీద కేసులు పెట్టారని, ఈ కేసులతో ఇక్కడుండే నిరుపేద దళిత కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. సర్వే నంబర్లు 197/1, 192, 207, 30/2, 74/1, 81, 75, 124, 78/1, 48/2, 123, 69, 73, 76/1, 77, 79, 80, 125,లలో మొత్తం 211 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఈ భూమిపై గ్రామానికి చెందిన కొందరు భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడి దీన్ని తప్పుడు పత్రాలు సష్టించి, పట్టాలు, కబ్జా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుందన్నారు .ఇదే గ్రామానికి చెందిన సుమారు 90 దళిత కుటుంబాలు భూమి లేక అత్యంత పేదరికంలో జీవనం సాగిస్తున్నారు. ఈ భూములను పరిశీలించి ఇట్టి ప్రభుత్వ భూమిలో గ్రామంలోని దళితులకు కేటాయించి వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని, దళితుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరుపేద దళిత కుటుంబాలకు భూములు పంచుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో మిడిదొడ్డి సురేష్, కే క్రాంతి కుమార్, యాకోబ్, ఆర్ వెంకన్న, ఆదాము, మరియమ్మ, లక్ష్మి, శాంతమ్మ, కొమరమ్మ, తదితరులు పాల్గొన్నారు.