Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి పట్టణంలో పట్టణ ప్రగతి
నవతెలంగాణ-భూపాలపల్లి
పట్టణ ప్రగతి ద్వారా ప్రజలకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని స్త్రీ శిశు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆదివారం భూపాలపల్లి పట్టణం సీఆర్నగర్ 3వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అధికా రులు, సిబ్బందితో కలిసి వార్డులో పర్యటించి పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివద్ధి జరుగుతుందని అన్నారు. అధికా రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభి వద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. సీఆర్న గర్లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న నిరుపేదలకు హక్కు పత్రాలు అందజేయాలని తెలిపారు. మున్సిపాలిటి వార్డు ప్రొఫైల్ మున్సిపల్ పరిధి అందరి వివరాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు పారిశుధ్య పనులకు 15 మంది కొత్త డ్రైవర్లను తీసు కుంటున్నట్లు తెలిపారు. పట్టణంలోని 1700 మంది నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగాల కొరకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ట్రస్టు ద్వారా కోచింగ్ నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతి ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మూడవ విడత పట్టణ ప్రగతి లో మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం వల్లే మలేరియా, డెంగ్యూ నియోజకవర్గంలో నమోదు కాలేదన్నారు. పెద్ద డ్రైన్ పనులు 30 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి గోదావరి జిల్లాలో అందిస్తామని అన్నారు. పట్టణ ప్రగతి లో ఉత్తమ సేవలందించిన వార్డు కౌన్సిలర్లకు ఆగస్టు 15న అవార్డులు అందించాలని కలెక్టర్ కు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లా డుతూ... అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పట్టణ పరిధిలో పారిశుధ్యం, హరితహారం పనులు జరుగుతున్నాయని తెలిపారు ఖాళీ స్థలంలో చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకుం టామన్నారు. ప్రతి వార్డులో నాటిన మొక్కల ను పరిశీలించి గ్రీన్ కమిటీ నివేదిక అందిస్తుం దన్నారు. కొంతమంది కాలువపై ఆక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, చర్యలు తీసుకుంటామ న్నారు. పట్టణ ప్రగతిలో ఉత్తమంగా వార్డును అభివద్ధి పరిచిన వారికి అవార్డులు అందజే స్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రాణి సిద్ధు మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకం ఎక్కువైందని, నిషేధించాలని కోరారు వార్డుల్లో ఫౌండేషన్, గ్రీన్ కమిటీలు ఏర్పాటు చేసి మొక్కలను పరిరక్షిస్తామన్నారు. అదనపు కలెక్టర్ దివాకర్, వైస్ చైర్మన్ హరిబాబు, కౌన్సిలర్లు పిల్లలమర్రి శారద, నారాయణ. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
చిట్యాల : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మండలంలోని దూదిపల్లి, గోపాలపురం ఓడితల గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో మన ఊరు మన బడి పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, కలెక్టర్ భవిష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఎస్ఎన్ కొత్త పెళ్లి పాఠశాలలోని మౌలిక వసతుల కల్పనకు రూ.64లక్షలతో శంకుస్థాపన చేశారు. అనంతరం ఒడితల గ్రామంలో గర్భిణులకు న్యూట్రిషన్ ఫుడ్ అందించారు. ముఖ్య మంత్రి కేసీిఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు, పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం తోడ్పడుతుం దన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మౌలిక వసతుల కల్పన కోసం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.64 లక్షలు మంజూ రు చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వ లేకే ప్రతి పక్షాలు సర్పంచులకు బిల్లులు వస్త లేవని రాద్దాంతం చేస్తున్నాయని మండిప డ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలం గాణ రాష్ట్రంలోని పథకాలు అమలు అవుతు న్నాయా.. అని ప్రశ్నించారు. 75 ఏండ్లుగా ఏ పార్టీ చేయనీ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్నదని అన్నారు. ఎంపీపీ వినోద వీరారెడ్డి, జెడ్పీటీసీ గొర్రె సాగర్,వైస్ ఎంపీపీ, నిమ్మగడ్డ రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్రెడ్డి, సర్పంచులు సాంబ లక్ష్మి, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు నరేందర్ శ్రీధర్ నవీన్,కార్యకర్తలు, పాల్గొన్నారు.