Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
డివిజన్లోని సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని 37వ డివిజన్ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ అన్నారు. ఆదివారం గిరిప్రసాద్నగర్, బుడిగ జంగాల కాలనీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్బంగా శానిటేషన్, డ్రెయినేజీ సమస్యలను గుర్తిం చారు. దీంతో కార్పొరేటర్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. అనంతరం ఖిలా వరంగల్ తూర్పు కోట పోచమ్మ గుడి వద్ద కల్వర్ట్ నిర్మాణం పనులను ప్రారం భించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంగర బోయిన విజరు, గిరిప్రసాద్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, బుడిగజంగాల కాలనీ నాయకులు పస్తం భిక్షపతి, ఏలీయా తదితరులు పాల్గొన్నారు.
31 డివిజన్లో మౌలిక వసతుల ఏర్పాటు
హనుమకొండ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం 31 డివిజన్ న్యూ శాయంపేటలోని కె ఆర్ఆర్ టౌన్షిప్ పరిసర ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలు సుకున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ పార్కు డెవల ప్మెంట్ చేయాలని, కాలనీలోని పలు సమస్యల గురించి ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా వినిపించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ రాజు మాట్లా డుతూ కాలనీవాసుల సమస్యలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి పార్క్ ను అభివద్ధి చేసేలా కషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్లానర్స్ శ్రీనివాస్, పట్టణ ప్రగతి నోడల్ ఆఫీసర్స్ సూర్యనారాయణ, జి డబ్ల్యూ ఎం సి శానిటైజర్ ఇన్స్పెక్టర్, వర్కింగ్ ఇన్స్పెక్టర్ రమేష్, మున్సిపాలిటీ జవాను ఇంద్రసేన, తదితరులు పాల్గొన్నారు
కాజీపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా, ఆదివారం కాజీపేట 62వ డివిజన్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జక్కుల రవీం దర్ యా దవ్ హాజరై మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్ర మంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, డివిజన్ అభివద్ధి ఏకైక లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, వర్క్ ఇన్స్పెక్టర్ గోపి, పిఎసిఎస్ డైరెక్టర్ రాజయ్య యాదవ్, అంగన్వాడీ టీచర్లు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కాంగ్రెస్ నాయకులు రమేష్, మహేందర్ రెడ్డి, విజరు పాల్గొన్నారు.