Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజెపి మండల అధ్యక్షులు కుమారస్వామి
నవతెలంగాణ-వర్ధన్నపేట
మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బిజెపి మండల అధ్యక్షుడు రాయపురం కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇటీవల రేప్ కు గురైన మైనర్ బాలికకు న్యాయం జరగాలని కోరుతూ సోమవారం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున బిజెపి చేస్తున్న ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరిన వర్ధన్నపేట మండలం లోని బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు.కార్యకర్తలను, నాయకులను ధర్నాలో పాల్గొన కుండా ముందస్తు అరెస్టులు, గహనిర్బంధం చేసినంత మాత్రాన మేము నిర్వహించబోవు ధర్నాలు ఆపలేరని వారన్నారు. పోలీస్ నిర్బంధంలో పట్టణ అధ్యక్షుడు చీటూ రి రాజు , జడ సతీష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఐత రవి ,మాజీ పట్టణ అధ్యక్షులు కొండేటి సత్యం, పట్టణ ఉపాధ్యక్షులు గిరి ప్రసాద్, ఎస్సీ మోర్చ పట్టణ అధ్యక్షులు కొండేటి బాబు, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ ఉన్నారు.
బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
దామెర : హైదరాబాద్లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితులపై కేసు పెట్టకుండా నీరు గారుస్తున్న రాష్ట్ర పోలీసుశాఖ వైఖరికి నిరసనగా సోమ వారం బిజెపి రాష్ట్ర శాఖ డిజిపి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మండల బీజేపీ అధ్యక్షుడు జంగిలి నాగరాజు, ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రశ్నిం చే వారిని అక్రమ అరెస్టులు చేయడం, రైతులను హింసించడం తప్ప పోలీసులు చేసేది శూన్యం అన్నారు.
చెన్నారావుపేట : రెండు రోజుల క్రితం హైదరాబాదులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని సోమవారం డిజిపి కార్యాలయం ముట్టడి వెళ్తుండగా మండలంలో బిజెపిి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసినట్లు.ఎస్ఐ తోట మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్టయిన వారిలో జిల్లా సీనియర్ నాయకులు వనపర్తి మల్లయ్య, మండల నాయకులు హంస హరికష్ణ, అల్లాడి నారాయణ , వీరమల్ల మహేందర్, దామెరుపుల శ్రీనివాస్, శేఖర్ ఉన్నారు.