Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూరింగ్ లేక పగుళ్ళు పడుతున్న వైనం
- అధికారుల పర్యవేక్షణ కరువు
- కాంట్రాక్టర్‌దే ఇష్టారాజ్యం
- ఇదీ మోరంచ చెక్ డ్యామ్ దుస్థితి
నవతెలంగాణ-గణపురం
మోరంచ చెక్ డ్యాం నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ఒకపక్క నిర్మాణ పనులు చేస్తుంటే మరోపక్క క్యూరింగ్ లేక పగుళ్లు ఏర్పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నాసిరకంగా పనులు చేస్తున్నా సంఘటన చెల్పూర్ మోరంచ చెక్ డ్యాం లో చోటు చేసుకుంది. రైతుల పంటలు సమద్ధిగా సాగు చేసుకునేందుకు నీరు నిల్వ ఉండేందుకు మోరంచ వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం నాబార్డ్ నిధులు రూ.376.33 లక్షలు మంజూరయ్యాయి. ఫిబ్రవరి 2న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేశారు. కాగా కాంట్రాక్టర్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు చేపడుతున్నాడు. ఏఈ, డీఈ స్థాయి అధికారులు. దగ్గర ఉండి సిమెంట్, ఇసుక, కంకర, ఎంత మోతాదులో కలపాలో వారి సమక్షంలో పనులు జరగాల్సి ఉంది. కానీ, అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడు. క్యూరింగ్ లేక పగుళ్ళు ఏర్పడ్డాయి. బిచ్చలు. బిచ్చలుగా ఊడిపోతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందనుకుంటే అలాంటిదేమీ లేకుండా పోతోంది. అధిక వర్షం వస్తే బ్రిడ్జి కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. అధికారులు సైతం మామూళ్ల మత్తులో పనులను పట్టించుకోకపోవడంతో పనులు నాసిరకంగా జరుగుతున్నట్లు ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు ఉపయోగపడేలా బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యతగా నిర్మించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.